ఈ డాన్స్‌ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

369
Dance Video
- Advertisement -

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం వచ్చాక చిన్న పెద్ద అందరూ తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. తమ టాలెంట్‌తో ఒక్కరోజులోనే పాపులర్‌ అయిపోతున్నారు. అయితే ఇప్పుడు అలాంటిదే ఓ నలుగురు కుర్రాళ్లు తమ టాలెంట్‌తో నెటిజన్‌లను ఆకట్టుకున్నారు. వారు చేసిన డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. తమలోని ప్రతిభను బయటపెడుతూ వారు విభిన్నంగా చేసిన ఈ డ్యాన్స్‌ను నెటిజన్లు పదే పదే చూస్తున్నారు. ఇలా డ్యాన్స్‌ చేయడం ఎలా సాధ్యమైంది? అనేలా ఎవరికీ అర్థం కాని విధంగా వారు స్టెప్పులు వేశారు.

ఈ న‌లుగురు కుర్రాళ్లు స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డీ చిత్రంలోని ముక్కాబులా అనే సాంగ్‌కి దిమ్మ‌తిరిగే స్టెప్పులు వేశారు. బాలీవుడ్ యాక్ట‌ర్ శృతి సేత్‌, టీవీ ప‌ర్స‌నాలిటీ గౌర‌వ్ కపూర్ ఆ గ్యాంగ్ వేసిన స్టెప్పుల‌కి ఫిదా అయ్యారు. 3.9 ల‌క్ష‌ల‌కి పైగా నెటిజ‌న్స్ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోని చూడ‌గా, 16000కి పైగా లైక్ చేశారు. 4700 మంది రీ ట్వీట్ చేశారు. అలస్యం ఎందుకు మీరు చూడండి.

https://twitter.com/cinnabar_dust/status/1229088152473817093

- Advertisement -