- Advertisement -
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 3.33 కోట్లు దాటగా 10 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుండి 2.46 కోట్ల మంది కోలుకున్నారు.
అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాలో 73 లక్షలు, ఇండియాలో 60 లక్షలు, బ్రెజిల్ లో 47 లక్షలు, రష్యాలో 11 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
పాజిటివ్ కేసులతో పాటుగా రికవరీ రేటు కూడా భారీగా ఉండటం కొంతమేర ఊరటనిచ్చే అంశం. రోజురోజుకి మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుండగా పూర్తి స్థాయి వాక్సిన్ వచ్చే వరకు అంతా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
- Advertisement -