బంగారం కొనుగోలు దారులకు శుభవార్త..

213
gold rate
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. సోమవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 తగ్గి రూ.52,140కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.47,800కు చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ.300 తగ్గి రూ.59,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.12 శాతం క్షీణతతో 1864 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.11 శాతం తగ్గుదలతో 23.06 డాలర్లుగా ఉంది.

- Advertisement -