World Cup 2023:నేడే తోలిపోరు.. టీమిండియా గెలిచేనా?

27
- Advertisement -

వరల్డ్ కప్ లో భాగంగా నేడు భారత్ తొలి మ్యాచ్ అడనుంది. ఆస్ట్రేలియాతో జరగనున్న ఈ మ్యాచ్ మద్యాహ్నం 1:30 చెన్నై లోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానాలు ఎంతగానో ఎదురు చేస్తున్నారు. తొలి మ్యాచ్ లో విజయం కోసం ఇటు టీమిండియా అటు ఆస్ట్రేలియా జట్లు గట్టిగానే పోటీపడుతున్నాయి. ఆస్ట్రేలియాపై ఇప్పటికే వన్డే సిరీస్ గెలుచుకోవడంతో టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. అటు ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్ లోని ఓటమికి ప్రతికరంగా భావించి టీమిండియాపై పై చేయి సాధించేందుకు ఆసీస్ తహతహలాడుతోంది.

ఇరు జట్ల బలాబలాల విషయానికొస్తే.. ఆసీస్ జట్టు బలమైన బ్యాట్స్ మెన్స్ మరియు పేస్ దళం తో బరిలోకి దిగుతోంది. టీమిండియా అన్నీ విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, కే‌ఎల్ రాహుల్ వంటి వారు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అయితే స్టార్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ మొదటి మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల గిల్ డెంగ్యూ ఫీవర్ బారిన పడ్డాడు. దాంతో తుది జట్టులో గిల్ ఉంటాడా అనేది సందేహమే. శుబ్ మన్ గిల్ స్థానంలో ఇషన్ కిషన్ లేదా కే‌ఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి తీవ్రంగా ఇప్పంది పడతారు. అందువల్ల ఈ మ్యాచ్ లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది. రవిచంద్రన్ అశ్విన్, కుల్దిప్, రవీంద్ర జడేజా.. తమదైన రీతిలో చెలరేగితే ఆసీస్ బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేయడం చాలా తెలికౌతుంది. ఇండియన్ పిచ్ లపై ఆసీస్ జట్టుకు కూడా మంచి రికార్డులే ఉన్నాయి. మరి తొలి మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

Also Read:కాంగ్రెస్‌కు ఓటేస్తే..కైలాసంలో పాము మిగినట్లే!

- Advertisement -