Ind Vs Aus T20:రెండో విజయం పై కన్ను!

41
- Advertisement -

ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ లో ముందంజలో ఉన్న టీమిండియా రెండో విజయం కోసం ఆరాటపడుతోంది. అటు ఆసీస్ జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించి లెక్క సరి చేయాలని చూస్తోంది. తిరువనంతపురంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకున్నాయి. వైజాగ్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, తిలక్ వర్మ, రెండో మ్యాచ్ లో కూడా చెలరేగితే భారత్ భారీ స్కోర్ సాధించడం ఖాయం.

బౌలింగ్ లో అర్షదీప్ సింగ్, బిష్ణోయ్ కాస్త మెరుగు పడాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్ జరగనున్న తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ మైదానం చాలా నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. తద్వారా బ్యాటింగ్ కు అనుకూలించక పోవచ్చు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం గ్రీన్ ఫీల్డ్ మైదానంలో నిన్నటి నుంచి వర్షం కురుస్తుండడంతో ఇవాళ కూడా వర్షం కురిస్తే మ్యాచ్ జరగకుండానే రద్దయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది

తుది జట్ల అంచనా

టీమిండియా : రుతురాజ్ గైక్వాడ్, యశస్వి, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, శివం దూబే, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ద్ కృష్ణ.

ఆస్ట్రేలియా ; స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లీస్, మార్కస్, స్టాయిఃనీస్, టిమ్ డేవిడ్, ఆరోన్ హర్ధి, మాథ్యూ వేడ్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రండార్ప్ తన్వీర్ సంఘా.

Also Read:Bigg Boss 7 Telugu:శివాజీ వర్సెస్ అమర్..క్లారిటీ ఇచ్చాడు

- Advertisement -