సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

46
Actress Sai Pallavi

టాలీవుడ్‌లో ఫిదా సినిమాతో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది మళయల కుట్టి సాయి పల్లవి. ఈమె కోసమే కథలు రాసే దర్శకులు కూడా తెలుగులో ఉన్నారు. ఇక ఫిదా సినిమాతో తర్వాత విడుదలైన ఎంసిఏ కూడా హిట్ కావడంతో స్టార్ హీరోయిన్‌ జాబితాలో చేరిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన కణం, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, మారి 2 లాంటి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో తెలుగులో కూడా సాయి పల్లవి ఇమేజ్‌ను బాగానే దెబ్బ తీసాయి. అయితే సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అమ్మడు క్రేజ్ మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ సినిమాకు దాదాపు కోటిన్నరకి పైగానే తీసుకుంటుందట సాయి పల్లవి.

ఇక ప్రస్తుతం నాగ చైతన్యతో లవ్ స్టోరీ.. రానా దగ్గుబాటితో విరాట పర్వం.. నానితో శ్యామ్ సింగ రాయ్ వరుస సినిమాలు చేస్తుంది ఈ హీరోయిన్. హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా సాయి పల్లవి రేంజ్ మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగానే ఉంది. అలాంటి ఇమేజ్ చాలా తక్కువ మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమవుతుంది.