సాయిపల్లవి సింప్లిసిటీకి ఫిదా కావాల్సిందే..

70
- Advertisement -

సాయిపల్లవి…. ఈ పేరు వినగానే.. కుర్రాళ్లలో జోష్‌ ఆటోమేటిక్‌ గా వస్తుందనే చెప్పొచ్చు… ఫిదా సినిమాతో తెలుగు అభిమానులను ఫిదా చేసిన ఈ బ్యూటీ.. అనతికాలంలోనే తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగిందనే చెప్పాలి. తనదైన నటనతో తెలుగింటి ఆడపడుచులా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్న సాయిపల్లవి గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉందనే చెప్పాలి.

ఆమె ఇటీవల నటించిన సినిమాలు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా… కమర్షియల్‌ గా హిట్‌ కాలేదని చెప్పాలి. అయితే ఆ తర్వాత సాయిపల్లవి ఏ సినిమాను ఒప్పుకోలేదనే తెలుస్తోంది. అయితే తెలుగులో సాయిపల్లవి ఎంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లేడి పవర్‌ స్టార్‌ అంటూ అభిమానులచే అప్యాయంగా పిలుపించుకునే సాయిపల్లవి ఎంత సింప్లిసిటీగా ఉంటారో చాలా మందికి తెలియదు.

ఓ స్టార్‌ హీరోయిన్‌ అనే విషయాన్ని మరిచిపోయిన సాయిపల్లవి సామాన్యురాలిగా క్యూలో నిల్చున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల పుట్టపర్తికి వెళ్లిన సాయిపల్లవి సత్యసాయి కొలువులోనే కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంది. అయితే ఈ వేడుకల్లో సాయిపల్లవి సింప్లిసిటీకి అందరూ ఫిదా అవుతున్నారు. ఒకసాధారణ భక్తురాలిగా కనిపించిన సాయిపల్లవి అందరిలో కలిసిపోయి కింద కూర్చున్న ఫోటో చూసినవారు ముగ్దులవుతున్నారు. ఓవైపు స్టార్‌ హీరోయిన్‌ గా.. మరో వైపు డాక్టర్‌ గా కొనసాగుతున్న సాయిపల్లవి సామాన్య భక్తులతో కలిసి ఉండడం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇవి కూడా చదవండి.. 

విలన్‌ తో తమన్నా డేటింగ్‌?

మొక్కలు నాటిన బిగ్ బాస్ శ్రీహాన్…

అమెరికాలో వీరయ్య జోరు

 

- Advertisement -