దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్‌కు మొగ్గుచూపుతున్నాయి పలు రాష్ట్రాలు. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ జరుగుతోంది. ఆగస్టు 31 వరకు వారానికి రెండురోజుల పాటు లాక్ డౌన్ అమలుచేయాలని మమతా సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో కోల్‌కతాలో ఎక్కడికక్కడ బంద్ పాటిస్తున్నారు.
ఇక మధ్యప్రదేశ్‌లో కూడా ఇవాళ్టి నుంచి పది రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. భోపాల్‌లో ఆగస్టు 4 వరకు లాక్ డౌన్ అమల్లోకి రాగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.
బెంగాల్‌లో కరోనా బాధితుల సంఖ్య 62,964కి చేరగా వీరిలో 42,0227మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 19,493 యాక్టివ్ కేసులు ఉండగా 1449 మంది మృత్యువాతపడ్డారు. కేవలం అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంకులకు మాత్రమే అనుమతి ఉండనుండగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశీయ విమాన సర్వీసులను కూడా నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.