బాలీవుడ్‌ వైకుంఠపురములో జాన్వీ..!

431
janvi kapoor
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బన్నీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. తాజాగా ఈ మూవీ బాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న సంగతి తెలిసిందే.

కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది. హిందీ నేటివిటీకి తగ్గట్టుగా కథలో స్వల్ప మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.

అల వైకుంఠపురములో కథ విన్న ఆర్యన్‌…వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. త్వరలో ఇందుకు సంబందించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశంఉంది.

- Advertisement -