జూన్ 1 నుండి లాక్‌డౌన్ ఎత్తివేత‌…

65
cm

మధ్యప్రదేశ్‌లో జూన్ 1 నుండి లాక్ డౌన్ ఎత్తివేస్తామని ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌. కరోనా పరిస్థితులపై ఉజ్జయిని సమీక్ష నిర్వహించిన శివరాజ్‌… జూన్ 1 నుండి జిల్లాల్లో క్రమంగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తామని తెలిపారు. తొలుత ఉజ్జయిని నుండి లాక్‌ డౌన్ ఎత్తివేత ప్రారంభమవుతుందన్నారు.

రాష్ట్రంలో క‌రోనా ఇన్‌ఫెక్ష‌న్ కేసులు నెమ్మ‌దిస్తున్నాయ‌ని, అలాగే డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండ‌టం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. అనాథ చిన్నారుల‌ను ఆదుకునేందుకు జిల్లాల క‌లెక్ట‌ర్లు జాబితాలు సిద్ధం చేయాల‌ని, అలాగే, త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన కుటుంబాల‌ను ఆదుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

అయితే అప్పటివరకు కఠినమైన లాక్‌ డౌన్ ఉంటుందని తెలిపిన శివరాజ్‌ సింగ్…ప‌రిమిత సంఖ్యలో వివాహ వేడుకల‌కు అనుమతించేలా మార్గ‌ద‌ర్శ‌కాలు సిద్ధం చేస్తున్నారు. థ‌ర్డ్‌ వేవ్ ను స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు ప్ర‌జ‌ల‌ను సన్న‌ద్ధం చేయడానికి ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.