చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇండియా వర్సెస్ వెస్టిండిస్ మధ్యలో వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో భాగంగా మొదట భారత్ బ్యాటింగ్ చేసింది. నిర్ణిత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 6, విరాట్ కోహ్లి 4 పరుగులకే అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ 36పరుగులు చేయగా ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 88బంతుల్లో 70 పరుగులు చేశాడు.
ఇండియా బ్యాటింగ్ అయ్యార్ కీలకంగా నిలిచాడు. ఇక మరో యువ ఆటగాడు రిషబ్ పంత్ కూడా రెచ్చిపోయాడు. 69బంతుల్లో 71పరుగులు సాధించాడు. శ్రేయాస్, పంత్‌తో పాటు కేదార్ జాదవ్ కూడా రెచ్చిపోయాడు. జాదవ్ 35 బంతుల్లో 45పరుగులు చేశాడు. ఇక మరో యువ ఆటగాడు శివం దుబే కేవలం 9 పరుగులకే వెనుదిరిగాడు. కరీబియన్ బౌలర్లలో కాట్రెల్, కీమోపాల్, ఆల్జారీ జోసెఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా పొలార్డ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.