గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన నటుడు సుబ్బరాజు

113
Subba Raju Green challeange

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు అనుహ్యమైన స్పందన వస్తుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా ప్రముఖ నటుడు సుబ్బరాజు మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.