వెలకమ్ టూ మాన్‌సూన్

43
- Advertisement -

ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా జూన్‌ 1వ తేదీన తీరం తాకాల్సిన నైరుతి రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. గతేడాది మే 29న దేశంలోకి ఎంటర్‌ కాగా ఈ సారి ఎల్‌నీనో ప్రభావం చేత ఆలస్యంగా ప్రవేశించాయి. దీంతో లక్షద్వీప్ కేరళ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: వేములలో ఫార్మా టెక్నాలజీ ప్లాంట్..

రుతుపవనాల ప్రభావంతో కేరళలో గత 24గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలప్పుజా ఎర్నాకుళం ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక తమిళనాడు మీదుగా కదిలేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని ఐఎండీ తెలిపింది. మరో వారం రోజుల్లో రాయలసీమలోకి ప్రవేశించి అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా తెలంగాణలో రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

Also Read: స్కిన్ అలర్జీ సమస్యలకు చక్కటి చిట్కా!

- Advertisement -