తల్లి కాబోయే వాళ్ళు..ఈ ఆసనం వేయాల్సిందే!

699
- Advertisement -

మన మారుతున్న జీవనం విధానంలో ఆరోగ్య సూత్రాలను పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడిలో పడి ఆరోగ్యంపై దృష్టి సారించడం మర్చిపోతుంటారు చాలమంది. అయితే రోజు ఉదయం పూట ఒక్క అరగంట యోగా కోసం కేటాయించిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. అందుకే ప్రతిరోజూ యోగాకు సమయం కేటాయించడం చాలా మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు. ఇక యోగాలో ప్రతి ఆసనం కూడా ఎన్నో ఉపయోగాలను చేకూరుస్తుంది. ఈరోజు యోగాలో గర్బిణి స్త్రీలకు ఎంతగానో మేలు చేకూర్చే ‘ వృక్షాసనం ‘ గురించి తెలుసుకుందాం !

వృక్షాసనం వేయడం వల్ల తుంటి ఎముకలు తెరచుకుంటాయి. చేతులు కాళ్ళకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దాంతో తిమ్మిర్లు వంటి సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా భుజాలు, పిక్కల కండరాలు కూడా బలపడతాయి. ఇక అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్న వృక్షాసనం వేయడం వల్ల తగ్గుముఖం పడుతుంది. అలాగే ఛాతీ విశాలం అవుతుంది.. తద్వారా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. శ్వాసపై సమతుల్యత ఏర్పడడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. అందువల్ల తల్లి కాబోయే వాళ్ళు వృక్షాసనం వేయగలిగితే శిశువు అమ్మ చెట్టు నీడలో ఉన్నట్టే అంటూ యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే తల తిరుగుతూ వాంతులు అవుతున్నట్లు అనిపించిన.. వెజైనా నుంచి రక్తస్రావం అవుతున్న ఈ ఆసనం వేయడానికి ప్రయత్నించ కూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వృక్షాసనం వేయు విధానం

ముందు నిటారుగా నిలబడి పదాలను దగ్గరకు ఉంచుకోవాలి. ఆ తరువాత శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ కుడి పాదాన్ని ఎడమ మోకాలుపై పెట్టి నిదానంగా శ్వాస వదలాలి. ఆ తరువాత రెండు చేతులను పైకెత్తి నమస్కారం చేస్తున్నట్లుగా ఉంచి మళ్ళీ శ్వాస ప్రక్రియ నెమ్మదిగా జరిగేటట్లు చూసుకోవాలి. ఇలా 20-30 సెకన్ల పాటు ఉండి… ఆ తరువాత యథాస్థితికి రావాలి. ఇలా మళ్ళీ కాలు మార్చి అదే ప్రక్రియ కొనసాగించాలి. ఇలా మార్చుకుంటూ రిలాక్స్ అవుతూ 5-10 నిముషాల పాటు ఈ వృక్షాసనం కొనసాగించాలి.

Also Read:తాటి ముంజలు తింటే ఎన్ని లాభాలో!

- Advertisement -