రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో

29
- Advertisement -

రాజకీయాలకు సినిమా వాళ్ళకు విడదీయలేని బంధం ఉంది. ఆంధ్రలో ఎన్టీఆర్.. తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరో స్టార్ కూడా రాజకీయ తెరపై తనదైన ముద్ర వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ కోలీవుడ్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన పది, ప్లస్‌– 2లో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో భేటీకి విజయ్‌ సిద్ధమయ్యారని టాక్.

DMK, AIDMK పార్టీలే లక్ష్యంగా విజయ్ పయనం ఉంటుందని సమాచారం. మరి దళపతి విజయ్ రాజకీయాలు చేస్తే.. తమిళనాడు సీఎం స్టాలిన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. పైగా గతంలో విజయ్ కూడా స్టాలిన్ కి ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేశాడు. మరి ఇప్పుడు ఉన్నట్టు ఉండి.. స్టాలిన్ సీఎంగా వుండగానే.. విజయ్ ఎందుకు రాజకీయాల గురించి ఆలోచిస్తున్నాడు అంటూ నెటిజన్లు కూడా చర్చ మొదలు పెట్టారు. మరి చివరకు విజయ్ రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.

Also Read: పెళ్లి మూడ్ లో ముగ్గురు హీరోలు ఇద్దరు హీరోయిన్లు !

ఇక సినిమాల విషయానికి వస్తే.. విజయ్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రస్తుతం లియో సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో త్రిష కథానాయికగా అలరించనుంది. తాజాగా చెన్నైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో 500 మంది డాన్సర్లతో విజయ్ స్టెప్పులు వేశారని చిత్ర బృందం చెప్తుంది. ఇది విజయ్ ఇంట్రడక్షన్ సాంగ్ అని, రెండు వారాల పాటు ఈ పాటనే చిత్రీకరించనున్నారని పేర్కొంటున్నారు. పాట కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసి సెట్ వేశారని తెలుస్తోంది.

Also Read: భగవంత్ కేసరి..రెస్పాన్స్ అదుర్స్

- Advertisement -