గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన వరంగల్ సీపీ

476
wgl cp
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాంలెజ్ కు విశేష స్పందన వస్తోంది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు వరంగల్ పోలీస్ కమీషనర్ డా. రవీందర్ . పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ప్రాంగణంలోని స్మృతి వనంలో మొక్కలు నాటారు. అనంతరం కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమాలసన్ రెడ్ది, వరంగల్ నిట్ డైరెక్టర్ ఎన్. వి. రమణారావు, వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస రెడ్డిలకు సీపీ రవీందర్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.. రాబోవు తరాలకు స్వచ్చమైన పర్యవరణాన్ని అందిచేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు భాధ్యతగా మొక్కలను నాటాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు వెంకట లక్ష్మీ, భీం రావు, ఆర్.ఐలు శ్రీనివాసరావు, సతీష్, భాస్కర్, ఇన్స్‌పెక్టర్ శ్రీలక్ష్మి, రాఘవేందర్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్ తో అర్ఎస్ఐలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.

- Advertisement -