విజయ్ దేవరకొండ ఇంటికి రష్మీక…ఎందుకో తెలుసా?

601
Vijay devarakonda
- Advertisement -

విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హిరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హిరోగా ఎదిగిపోయారు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు వరుసగా విజయం సాధించడంతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ టాలీవుడ్ హీరోల్లో టాప్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక విజయ్ దేవరకొండ చివరగా నటించిన సినిమా డియర్ కామ్రేడ్. ఈ మూవీ కాస్త నిరాశ పరిచింది. తాజాగా విజయ్ కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు. మొన్నటి వరకు శ్రీనగర్ కాలనీలో ఉంటున్న విజయ్ ఫ్యామిలీ.. ఇటీవలే ఫిల్మ్ నగర్‌లోని నటుడు శ్రీకాంత్ ఇంటికి సమీపంలో ఉన్న కొత్త ఇంటికి మారారు.

Vijay-and-Rashmika

విజయ్ ఆ ఇంటికోసం దాదాపు రూ.20కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. తాజాగా విజయ్ దేవరకొండ.. తన తల్లితండ్రులు, సోదరులతో కలిసి కలిసి ఈ ఇంట్లో శాస్త్రోక్తంగా గృహ ప్రవేశం చేసాడు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు విజయ్. విజయ్ కొత్త ఇంటి గృషప్రవేశానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా కుటుంబ సమేతంగా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లారు దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరోయిన్ రష్మిక మందన. ఈ సందర్బంగా ఓ ఫోటో దిగారు. ఆ ఫోటోలో విజయ్ తమ్ముడు ఆనంద్ కూడా ఉన్నారు. ఇక విజయ్ ఇంటికి రష్మీక రావడంతో వీరిద్దరి మధ్యలో ప్రేమ ఇంకా కంటిన్యూ అవుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -