తెలంగాణ, ఏపీలో పెరిగిన ఓటింగ్ శాతం..

257
evm
- Advertisement -

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్‌ జరుగుతోంది. తెలంగాణలోని 17పార్లమెంట్ స్ధానాల్లో పోలింగ్ ప్రశాతంగా జరుగుతుండగా..ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మెరాయించుతున్నాయి. ఈవీఎంలు పనిచేయని చోట కొత్త ఈవీఎంలను అమర్చుతున్నారు అధికారులు. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు తరలివస్తున్నారు ఓటర్లు. ఉదయం 11గంటలకు తెలంగాణలో 29శాతం మాత్రమే నమోదవగా..ఎపిలో 31శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు అధికారులు.

ఇక తాజాగా ఒంటిగంట వరకూ తెలంగాణలో 38.8శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు అధికారులు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉదయం కొంచెం ఈవీఎంలు సతాయించిన మధ్యాహ్నం వరకూ సర్దుకున్నాయని తెలిపారు ఎన్నికల అధికారి ద్వివేది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఎపీలో 46శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. సాయంత్రానికల్లా ఈ శాతం పెరుగుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -