ఓటేసిన రోజా,చైతూ,రవితేజ

486
raviteja
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ మందకోడిగా సాగుతోంది. ఇప్పటివరకు 30 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.సినీ,రాజకీయ ప్రముఖులు పెద్దసంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సినీనటి ఝాన్సీ. నగరిలో రోజా,హైదరాబాద్‌లో నాగచైతన్య-సమంత తమ ఓటు వేశారు.ఏపీలోని అనంతపురుం జిల్లా హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య వసుంధరతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన బాలయ్య ఓటేశారు.

roja

టాలీవుడ్ హీరో నాగచైతన్య, భార్య సమంతా హైదరాబాద్ లో తమ ఓటు హక్కుని వినయోగించుకున్నారు. గచ్చిబౌలిలోని నానక్ రామ్ గూడ లోని పోలింగ్ కేంద్రంలో అక్కినేని నాగ చైతన్య దంపతులు ఓటు వేశారు. కాగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ,రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్,రవితేజతో పాటు సినీ నటులు పెద్దసంఖ్యలో తమ ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కుచన్ పల్లి గ్రామం లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సీఎం కేసీఆర్ రాజకీయ సలహాదారు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి.రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం లోని అశోక్ నగర్ లోతన ఓటు హక్కును వినియోగించుకున్న బండారి లాస్మవ్వ అనే (104) సం వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకుంది.

ravi teja vote

roja nikhil

- Advertisement -