రాజకీయాలు,ఓటు హక్కుపై విజయ్‌ సంచలన వ్యాఖ్యలు!

194
vijay devarakonda

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ హీరోగా మారారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్‌ తాజాగా పాలిటిక్స్‌, ఓటు హక్కుపై సంచలన వాఖ్యలు చేశారు.

తనకు రాజకీయాలు చేసేంత ఓపిక లేదని అయితే ప్రస్తుతం మన దేశంలో రాజకీయ వ్యవస్థ అంతా అర్థంపర్థం లేకుండా ఉందని తెలిపారు. ఓ వైపు ఓటర్లు డబ్బుకు, లిక్కర్‌కు అమ్ముడుపోవడం మరోవైపు రాజకీయ నాయకులు మందు, డబ్బుతో ఓటర్లను కొనడం అన్నీ సర్వసాధారణం అయిపోయందన్నారు.

డబ్బు,మందు తీసుకుని ఓటు వేసే వారి ఓటు హక్కు తీసేయాలని ప్రస్తుతమున్న వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.