బీహార్ ఎన్నికలు..కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే!

90
congress

మూడు దశల్లో బీహార్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 243 స్ధానాలుండగా ఆర్జేడీ,కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి….నితిష్ కుమార్ సారథ్యంలో బీజేపీ కూటమితో తలపడనుంది. మొద‌టి విడ‌ట ఈనెల 28న‌, న‌వంబ‌ర్ 3, 7 తేదీల్లో రెండు, మూడో విడుత ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. న‌వంబ‌ర్ 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రచారానికి ఏర్పాట్లు చేసింది. 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది.

సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక‌తోస‌హా బాలీవుడ్ న‌టులు శత్రుఘ్నసిన్హా, రాజ్‌బబ్బర్ , మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌, పంజాబ్ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రింద‌ర్ సింగ్, రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా ఉన్నారు. పార్టీ అసంతృప్త నేతలు గులాం నబీ ఆజాద్, సచిన్ పైలట్, సంజయ్ నిరుపమ్ తదితరుల పేర్లు కూడా ఆ జాబితాలో ప్ర‌క‌టించింది. వీరంతా మూడు దశల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఎన్నికల సంఘానికి నివేదించింది కాంగ్రెస్.