ఎన్టీఆర్…అరవింద సమేతకు రెండేళ్లు

160
aravinda sametha

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన క్లాసికల్ హిట్ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఎన్టీఆర్ నటన,పూజా హెగ్డే గ్లామర్,తమన్ సంగీతం ఇలా అన్ని కలగలిపి క్లాసికల్‌ హిట్‌గా నిలిచింది అరవింద సమేత.

రాయలసీమ లో నల్లగుడి, కొమ్మద్ది అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు త్రివిక్రమ్‌. 5 రూపాయల ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఆధ్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించిన త్రివిక్రమ్‌… రెండు గ్రామాల మధ్య గొడవలను, కక్షలను ఎలా చల్లార్చాడు అనేది ఆసక్తికరం.

సాంకేతికంగా సినిమా సూపర్బ్. త‌మ‌న్ అందించిన సంగీతం సినిమాను మరో స్ధాయికి తీసుకెళ్లింది. నేపథ్య సంగీతం విషయంలో తమన్ వంద శాతం న్యాయం చేశారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్. ఎన్టీఆర్‌ను చూపించిన తీరు, యాక్ష‌న్ స‌న్నివేశాలు తెర‌కెక్కించిన విధానం ఆక‌ట్టుకుంటాయి.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక అరవింద సమేతతో నెరవేరింది. కథ,ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా ఓవరాల్‌గా త‌న శైలికి భిన్న‌మైన క‌థ‌ను ఎంచుకుని ప్రేక్షకులను మెప్పించారు త్రివిక్రమ్-ఎన్టీఆర్.