పెళ్లి పీఠలు ఎక్కనున్న విద్యుల్లేఖ రామన్..!

115
vidylleka

లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ తన ప్రియుడితో రహస్య నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది విద్యుల్లేఖ. ఆగస్టు 26న తమ ఎంగేజ్‌మెంట్ జరిగిందని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు,సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగిందన్నారు.తాము మాస్కులు వేసుకుని ఫోటోల కోసం వాటిని తీసేసి మళ్లీ వేసుకున్నామని చెప్పింది.

తమిళ టెలివిజన్ నటుడు మోహన్ రామన్ కుతురే ఈ విద్యుల్లేఖ. తండ్రి వలె కెమెరా ముందు సత్తా చాటిన ఆమె పలు తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో నటించి హాస్యం పండించింది. రీసెంట్‌గా ఆమె ”విశ్వమిత్ర, అర్జున్ సురవరం, వెంకీ మామ, మత్తు వదలరా” సినిమాల్లో కనిపించింది.