ఆర్సీబీలోకి ఆడమ్ జంపా!

344
aadam jampa

ఐపీఎల్ ప్రారంభానికి మరికొద్దిరోజులు మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికే అన్ని ఫ్రాంఛైజీలు యూఏఈకి చేరుకోగా త్వరలో ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. ఇక దుబాయ్‌కి చేరుకున్న ఆటగాళ్లలో కొంతమంది కరోనా బారీన పడగా మరికొంతమంది వ్యక్తిగత కారణాలతో తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోతున్నారు.

తాజాగా ఆర్సీబీకి చెందిన ఆసీస్ క్రికెటర్ కేన్ రిచర్డ్‌సన్ స్ధానంలో స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాను ఎంపిక చేసింది మేనేజ్‌మెంట్. ఆర్‌సీబీలోకి జంపాను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం. కేన్‌ రిచర్డ్‌సన్‌ స్థానాన్ని అతను భర్తీ చేస్తున్నాడు. లెట్స్‌ ప్లేబోల్డ్‌ జంపా అని పేర్కొంది ఆర్సీబీ. దీంతో ఆర్సీబీ స్పీన్ దళానికి మరింత బలం చేకూరింది.