టీబీతో జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి

416
Venkaiah-Naidu
- Advertisement -

దేశ వ్యాప్తంగా 3లక్షల మంది చిన్నారులు టీబీతో బాధపడుతున్నారన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హెచ్ఐసీసీలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి ఏకే చౌబే, గవర్నర్ తమిళిసై, మంత్రి ఈటెల రాజెందర్ పాల్గోన్నారు.

ఈసందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… ప్రపంచంలో ప్రాణాలను హరించే 10 వ్యాధుల్లో టీబీ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా టీబీతో 1.5 మిలియన్ల మంది చనిపోతున్నారు. 2025 కల్లా టీబీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం టీబీ ఆరేగా-దేశ్ జీతేగా కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందన్నారు. టీబీతో జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. పాతకాలపు జీవన విధానాలు, ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. కాలుష్యం తగ్గించేందుకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నారు.

- Advertisement -