శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించిన తోటి మంత్రులు..

16
ch mallareddy

తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా,పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ను సహచర మంత్రులు ఈటల రాజేందర్‌, చామకూర మల్లారెడ్డి పరామర్శించారు. మహబూబ్ నగర్‌లోని శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఆయనను మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు. దివంగత నారాయణ గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.మంత్రుల వెంట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి, షీప్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, అందే బాబయ్య, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు తదితరులు ఉన్నారు.