థియేటర్ వైపు ‘నారప్ప’ అడుగులు..!

141
Narappa

టాలీవుడ్‌ హీరో వెంకటేష్- శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం నార‌ప్ప‌. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య సుందరమ్మగా చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌ గ్లిమ్స్‌, పోస్టర్స్‌తో పాటు ‌విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన నార‌ప్ప టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు సినిమా చూసి యూనిట్ సభ్యులను ప్రశంసించారు. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీలో డిఫ‌రెంట్‌ షేడ్స్ ఉన్న పాత్రల‌లో విక్ట‌రి వెంకటేష్ కనిపించనున్నారు.

ఇక చిత్రం విడుదల విషయానికొస్తే.. ముందుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ నేపథ్యంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో, ఓటీటీ వైపు వెళుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారనే టాక్ బయటికి వచ్చేసింది.

అయితే ఈ విషయంలో వెంకీ అభిమానులు పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు త్వరలో థియేటర్లు ఓపెన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందువలన ముందుగా థియేటర్లలోనే రిలీజ్‌ చేసి, ఆ తరువాతనే ఓటీటీకి వెళదామని మేకర్స్ ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. మరి నారప్ప ఎటువైపు వెళ్లుతాడో చూడాలి.