ఒలింపిక్ అథ్లెట్‌కు కరోనా పాజిటివ్…

74
Tokyo Olympic

త్వరలో టోక్యోలో ఒలింపిక్స్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నిదేశాలు ఒలింపిక్స్‌కు సమాయత్తం అవుతుండగా టోక్యోకు చేరుకున్న సెర్బియా బృందంలోని ఓ అథ్లెట్ కరోనా బారిన పడ్డాడు.

హనెడా విమానాశ్రయంకు చేరుకున్న సెర్బియా టీం ఆటగాళ్లకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా ఒకరకి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ బృందం నాంటో నగరంలో ఒలింపిక్స్ కోసం శిక్షణ పొందాల్సి ఉండగా, పాజిటివ్‌గా తేలిన అథ్లెట్‌ను ఐసోలేషన్‌కు పంపారు. మిగతా వారిని ఎయిర్‌పోర్టు సమీపంలోని ప్రత్యేక కేంద్రానికి తరలించారు.