తెలుగు తేజం సింధుకు పార్ల‌మెంట్ అభినంద‌న‌లు

54
sindhu

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింట‌న్‌లో కాంస్య ప‌త‌కం గెలిచిన పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇవాళ భార‌త‌ పార్ల‌మెంట్‌ ఉభయసభలు అభినంద‌న‌లు తెలిపాయి. స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. బ్యాడ్మింట‌న్ మ‌హిళ సింగిల్స్‌లో హైద‌రాబాద్ క్రీడాకారిణి సింధు బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన‌ట్లు చెప్పారు. వ్య‌క్తిగ‌త ఈవెంట్‌లో రెండు మెడ‌ల్స్ వ‌రుస‌గా గెలుచుకున్న భార‌తీయ మ‌హిళా క్రీడాకారిణి ఆమె అని స్పీక‌ర్ తెలిపారు. ఆమె సాధించిన విజ‌యాలు ఈ దేశ యువ‌త‌కు ప్రేర‌ణ‌కు నిలుస్తుంద‌ని భావిస్తున్న‌ట్లు ఓం బిర్లా వెల్ల‌డించారు.

రాజ్య‌స‌భ‌ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు.. ష‌ట్ల‌ర్ సింధుకు కంగ్రాట్స్ తెలిపారు. ఒలింపిక్స్‌లో సింధుఎ అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించిందని, వ‌రుస‌గా రెండు ఒలింపిక్స్‌లో మెడ‌ల్స్ సాధించిన తొలి భార‌తీయ మ‌హిళా క్రీడాకారిణిగా ఆమె చ‌రిత్ర సృష్టించిన‌ట్లు వెంక‌య్య తెలిపారు.