అశ్విన్ బాబు ‘హిడింబ‌’ ఫ‌స్ట్ లుక్

75
cinema

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అశ్విన్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘హిడింబ‌’. అనీల్ కృష్ణ క‌న్నెగంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్‌(ఎస్‌.వి.కె.సినిమాస్‌) బ్యాన‌ర్‌పై గంగ‌ప‌ట్నం శ్రీధ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అశ్విన్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో టైటిల్‌ను‘హిడింబ‌’గా తెలియ‌జేశారు. పోస్ట‌ర్‌ను చూస్తే .. అశ్విన్ త‌ల‌పై ర‌క్త‌పు చుక్క‌లు.. చేతిలో ఇనుప చువ్వ‌ను ప‌ట్టుకుని మెలి తిప్పిన మీసాల‌తో యుద్ధానికి సిద్ధం అనేలా యాక్ష‌న్ ప్యాక్డ్ లుక్ క‌నిపిస్తుంది.

ఇతిహాసాల్లో శ‌క్తివంతమైన రాక్ష‌స‌రాజు పేరే హిడింబ‌. పోస్ట‌ర్‌లో హీరో లుక్ చూస్తుంటే ఈ సినిమా టైటిల్ ప‌క్కాగా స‌రిపోయేలా ఉంద‌నిపిస్తుంది. ఈ సినిమా కోసం అశ్విన్ బాబు మేకోవ‌ర్ అయ్యాడు. త‌న లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. సినిమా ఇప్ప‌టికే యాబై శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. నందితా శ్వేత హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో చాలా మంది ప్ర‌ముఖ న‌టీన‌టులు న‌టిస్తున్నారు.

బి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహిస్తున్న ఈ చిత్రానికి వికాస్ బ‌డిసా సంగీతాన్ని అందిస్తున్నారు.న‌టీన‌టులు:అశ్విన్ బాబు, నందితా శ్వేత‌, శ్రీనివాస రెడ్డి, సాహితి అవంచ‌, సంజ‌య్ స్వ‌రూప్‌, సిజ్జు, విద్యుల్లేఖా రామ‌న్‌, రాజీవ్ క‌న‌కాల‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, ప్ర‌మోదిని, ర‌ఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్ల‌మోతు త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: అనీల్ కృష్ణ కన్నెగంటి
నిర్మాత‌: గంగ‌ప‌ట్నం శ్రీధ‌ర్‌
బ్యాన‌ర్‌: ఎస్‌.వి.కె సినిమాస్‌
సినిమాటోగ్ర‌ఫీ: బి.రాజ‌శేఖ‌ర్‌
ఎడిట‌ర్‌: ఎం.ఆర్‌.వ‌ర్మ‌
ఫైట్స్‌: జాషువా, రియ‌ల్ స‌తీశ్‌
సంగీతం: వికాస్ బడిసా
కొరియోగ్ర‌ఫ‌ర్స్‌: శేఖ‌ర్ వి.జె, య‌శ్‌
డైలాగ్స్‌: క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి
పాట‌లు: రామ‌జోగయ్య శాస్త్రి, ప్ర‌ణ‌వం
ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్‌: అనీల్, భాను
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: మౌన గుమ్మాడి
ఆర్ట్‌: ష‌ర్మిల య‌లి శెట్టి
పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌