మహేశ్‌కి క్రేజీ బర్త్ డే గిఫ్ట్!

48
mahesh

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు అప్‌డేట్స్ ఇస్తూ వచ్చిన చిత్రయూనిట్ తాజాగా మహేశ్ బర్త్ డే సందర్భంగా క్రేజీ అప్‌డేట్ రానుందని ప్రకటించింది.

ఇందుకు సంబంధించి పోస్టర్‌ని విడదుల చేసింది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సినిమాను 2022 జనవరి 13న విడుదల చేయబోతున్నట్టు ఈ పోస్టర్ ద్వారానే వెల్లడించారు. మొత్తానికి సంక్రాంతి బరిలో మహేష్ బాబు కూడా నిలవనున్నాడు.

మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోండగా మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.