జహీరాబాద్‌లో వెమ్ టెక్నాలజీ భారీ పెట్టుబడి..

137
- Advertisement -

హైదరాబాద్‌ జహీరాబాద్ లో Integrated Defence Systems Facility కోసం వెమ్ టెక్నాలజీ తో MoU ఒప్పందం కుదుర్చుకుందిరాష్ట్ర ప్రభుత్వం. ఈ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ మినిష్టర్ కేటీఆర్, నీతి అయోగ్ మెంబర్ డాక్టర్ వీ.కే. సరస్వథ్, DRDO చైర్మన్ సతీష్ రెడ్డి, ఐటీ సెక్రెటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ లో వేయి కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్న వెమ్ టెక్నాలజీ కి ధన్యవాదాలు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీ వల్ల రెండు వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. వెమ్ టెక్నాలజీ ఎం.డి. వెంకటరాజు… స్టార్టప్ సంస్థలకి, ఎమ్.ఎస్.ఎమ్.ఇ. లకు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు.

తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ప్రతి కంపెనీకి, టాలెంట్ ఉన్న వివిధ స్టార్టప్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, చేయూతనిస్తుందన్నారు. తెలంగాణ డిఫెన్స్, ఎరో స్పేస్ రంగంలో వెమ్ కొత్త చరిత్ర సృష్టిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. దేశం గర్వించదగ్గ సంస్థ వెమ్ టెక్నాలజీ.. డిఫెన్స్ రంగంలో వెమ్ టెక్నాలజీ అందిస్తున్న సేవలకు ధన్యవాదాలు తెలిపారు. జహీరాబాద్ లో స్కిల్ సెంటర్ ని కూడా ఏర్పటు చేయడం సంతోషం అన్నారు.

- Advertisement -