‘వీర సింహా రెడ్డి’ ఎలా ఉందంటే ?

58
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ గా పిలువబడుతున్న బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి రేస్ లో వచ్చిన ఈ సినిమా మొదటి భాగం ఆకట్టుకుంది. రెండో భాగం వచ్చే సరికి రొటీన్ స్క్రీన్ ప్లే తో సెంటిమెంట్ సన్నివేశాలతో సా…గింది. సింహా , లెజెండ్ టెంప్లేట్ తో గోపీచంద్ మలినేని ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఫ్యాన్స్ కోరుకునే అన్నీ ఎలిమెంట్స్ పెట్టేసి బోయపాటి ను గుర్తుచేశాడు గోపీచంద్ మలినేని. రెండో భాగాన్ని చెన్న కేశవ రెడ్డి తరహాలో సిస్టర్ సెంటిమెంట్ , ఫ్లాష్ బ్యాక్ తో నడిపించి బోర్ కొట్టించాడు.

సెటైరికల్ డైలాగ్స్ , గూస్ బంప్స్ ఇచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. ముఖ్యంగా వీరసింహా రెడ్డిగా బాలయ్యను అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. కానీ ఆ పాత్ర ఇంటర్వల్ కే క్లోజ్ చేయడంతో రెండో భాగం అంత కిక్ ఇవ్వదు. తమన్ సంగీతం బాగుంది. శృతి హాసన్ గ్లామర్ పాత్రకే పరిమితమైంది. సినిమా మొదలైన కాసేపతికే వచ్చే యాక్షన్ ఎపిసోడ్ బాగుంది. తర్వాత వచ్చే పది నిమిషాల లవ్ ట్రాక్ మాత్రం సోది అనిపిస్తుంది. కానీ వీర సింహా రెడ్డి కేరెక్టర్, యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం ఫస్ట్ హాఫ్ ని పాస్ చేసేస్తాయి.

ఇంటర్వల్ బ్లాక్ పరవాలేదు. సెకండాఫ్ లో గోపీచంద్ మరీ రొటీన్ సెంటిమెంట్ డ్రామాతో నడిపించాడు. పైగా ఫ్లాష్ బ్యాక్ వర్కవుట్ అవ్వలేదు. దీంతో సెకండాఫ్ నిరాశ పరుస్తుంది. ఓవరాల్ గా వీర సింహా రెడ్డి ఫస్ట్ హాఫ్ సూపర్ , సెకండాఫ్ డ్రాప్ అనిపిస్తుంది. సంక్రాంతి సీజన్ లో పైసా వసూల్ చేయడం మాత్రం గ్యారెంటీ.

ఇవి కూడా చదవండి..

- Advertisement -