కేటీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ..

38
minister ktr

మంత్రి కే తారకరామారావుని వివిధ శాఖల ఉన్నతాధికారులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ వివిధ శాఖల ఉన్నతాధికారులను కలిశారు. పురపాలక మరియు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిలతో పాటు వివిధ విభాగాల అధిపతులు మరియు ఇతర శాఖలకు చెందిన పలువురు అధికారులు మంత్రి కేటీఆర్‌ను ఈరోజు కలిశారు.

ముఖ్య కార్యదర్శులు జయేష్ రంజన్, అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి దాన కిషోర్ మరియు రంగారెడ్డి మేడ్చల్, జిల్లా కలెక్టర్ లతోపాటు జీహెచ్ఎంసీకి చెందిన అడిషనల్ కమిషనర్ లు పలువురు మంత్రి కేటీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్ రాజ్, మెట్రో రైల్ ఎమ్డి ఎన్‌వీఎస్‌ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు, సిడియంఏ సత్యనారయణ, హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్ సైతం మంత్రి కేటీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈరోజు మంత్రి కేటీఆర్ ని అధికారులతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సైతం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్, ఈ సంవత్సరం అందరికీ మరింత సంతోషాన్ని తీసుకువస్తుందని అభిలాషించారు.