కాంగ్రెస్ నాయకులవి అర్థంలేని ఆరోపణలు: వంటేరు

161
Vanteru Pratap Reddy

సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా రాష్ట్ర అడవి శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి దౌల్తాబాద్ మండలంలో ఉప్పర్ పల్లి, గోలి గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రులను మేమే అని చెప్పుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలు దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు కదా కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాకపోతే మీరు ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత ఆ స్థైర్యం కోల్పోయి మీరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తదని వంటేరు ఎద్దేవ చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలకు సవాల్ విసురుతున్న దుబ్బాక నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమం లేని ఇల్లు ఉంటే చూపించండి. దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు వస్తున్న ఆదరణ చూసి ఆత్మ స్థైర్యం కోల్పోయి కాంగ్రెస్ నాయకులు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పీసీసీ కోసం ఒకరినొకరు కొట్లాట తప్ప ప్రజల బాగోగులు వారికి అవసరం లేదు ప్రతాప్ రెడ్డి విమర్శించారు.