Vinod Kumar:ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం బాధాకరం

11
- Advertisement -

ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేయడం బాధాకరమన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ విప్ గువ్వల బాలరాజు, పార్టీ కార్మిక విభాగం అధ్యక్షులు రాంబాబు యాదవ్, ఇన్చార్జ్ ఎల్.రూప్ సింగ్, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి సోమవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వినోద్ కుమార్.. ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేయడం బాధాకరం అన్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్యేల కోసం క్యాంప్ కార్యాలయాలను నిర్మించిన ఘనత అప్పటి సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల శిలాఫలకాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. హనుమకొండ, అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల శిలాఫలకాలను… ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్లో ఉన్న శిలాఫలకంపై కేసీఆర్ పేరును మట్టితో చెరిపివేయడం వంటి దుశ్చర్యలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్పడ్డారన్నారు.

ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు అన్నారు. శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిపై కేసులను నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని..
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేత ధ్వంసమైన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల శిలాఫలకాలను తిరిగి పునరుద్ధరించాలన్నారు. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల శిలాఫలకాల ధ్వంసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందని అని నేను అనుకోవడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు రోజులు మాత్రమే అవుతున్నదని.. అలాంటప్పుడు కొత్త ప్రభుత్వం పై విమర్శలు చేయడం తన ఉద్దేశం కాదు అని తెలుసు. అయితే ఈ ఘటనపై స్పందించక తప్పడం లేదన్నారు.

Also Read:ఆర్టికల్ 370.. సమంజసమే!

ముఖ్యమంత్రిగా కేసీఆర్ నేతృత్వంలో దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందని…రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందని గర్వంగా చెబుతున్నా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకటే చెబుతున్న. మేము అధికారంలో ఉండగా ఒక లక్ష 61 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదని మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు. ఒక లక్ష 61 వేల ఉద్యోగాలు భర్తీ చేయలేదని నిరూపించగలరా..? రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాల ఖాళీల జాబితాను వెల్లడించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -