రూల్స్ బ్రేక్ చేసిన పబ్ సీజ్ చేసిన అధికారులు..

207
Resign Sky pub sealed
- Advertisement -

నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తున్న మాదాపూర్ లోని రిజైన్ స్కై బార్ పబ్‌ను సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. కరోనా రూల్స్ కు విరుద్దంగా జనం గుమిగూడడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించలేదని నిర్ధారించారు. బార్‌లో పనిచేసే వెయిటర్లు ఎక్కడా మాస్కులు ధరించలేదని గుర్తించారు. పబ్‌లో రష్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎక్సైజ్ శాఖ దర్యప్తుకు ఆదేశించింది. ఉదయం పబ్‌పై రైడ్ నిర్వహించిన పోలీసులు కస్టమర్లు, సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టే విధంగా యాజమాన్యం వ్యవహరించిందని నిర్ధారించి పబ్‌ను సీజ్ చేశారు. ఎక్సైజ్ చట్టం సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు.

- Advertisement -