కవితక్క కు శుభాకాంక్షలు: ఎంపీ సంతోష్‌

212
mp santhosh

ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో రెండు జాతీయ పార్టీల డిపాజిట్లు గల్లంతు చేసి అత్య‌ధిక మెజార్టీతో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కవితక్క కు శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల్లో గెలుపొందిన ప్రియ‌మైన సోద‌రికి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. క‌విత గెలుపు నిజామాబాద్ అభివృద్ధికి మ‌రింత దోహ‌దం చేస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.