- Advertisement -
బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా సాగుతుంది. తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త వంగ రాజేశ్వర్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తన నివాసంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఒక వృక్షానికి రిప్లాంటేషన్ కి అయ్యే ఖర్చుని తానే బరిస్తానని తెలియజేస్తూ….తెలంగాణ లో గ్రీనరీ పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ అవకాశం కల్పించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తన కూతురు అకీరా, అన్న కూతురు ఆధ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
మొక్కలు నాటిన షాబాద్ జెడ్పీటీసీ…
పుస్తక ప్రియులకు…మొక్కల పంపిణీ
చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం :సీఎస్
- Advertisement -