బండి పాదయాత్రకు బ్రేక్.. అంతా కన్ఫ్యూజన్ !

38
- Advertisement -

తెలంగాణలో వవ్ఛే ఎన్నికలతో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి ప్రజా మద్దతు లభించడంలేదు. రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్ తరువాతి స్థానం బీజేపీదే అని, కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని కమలనాథులు జబ్బలు చరుస్తున్న చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు రాష్ట్ర ప్రజలు. కమలనాథులు ఎన్ని వ్యూహాలు వేస్తున్న ఫలించక పోగా.. తిరిగి పార్టీకే బెడిసికొడుతున్నాయి. దాంతో ప్రజాకర్షణకోసం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది బీజేపీ అధిష్టానం. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పా.. మిగిలిన ఏ నాయకుడు కూడా యాక్టివ్ గా కనిపించడం లేదు. ఈటెల రాజేందర్ అప్పుడప్పుడు కే‌సి‌ఆర్ పై ఘాటు విమర్శలు చేస్తూ పోలిటికల్ హిట్ పెంచే ప్రయత్నం చేస్తున్నప్పటికి.. అవన్నీ కూడా తాటాకు చప్పుల్లే అని ప్రజలకు స్పష్టంగా అర్థమౌతోంది. .

దీంతో కమలనాథులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ప్రజాకర్షణ మాత్రం లభించడం లేదు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కమలనాథులు అంతా సంజయ్ పాదయాత్రపైనే ఆధారరపడ్డారు. బండి సంజయ్ పాదయాత్రతో ప్రజల్లో పార్టీకి మంచి మైలేజ్ లభిస్తుందని భావిస్తే.. అలాంటి సూచనలేవీ కనిపించడం లేదు. ఇప్పటిదాకా ఐదు విడతలు కంప్లీట్ చేసుకున్నా పాదయాత్రపై ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో బిజేపీ అధిష్టానం కూడా డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది.దాంతో ఆరో విడత పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలా.. వద్దా అనే దానిపై అధిష్టానం తర్జన భర్జన పడుతోందట.

వచ్చే నెలలో బండి సంజయ్ ఆరో విడత పాదయాత్ర ఉండే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. కానీ ప్రజాదరణ అనుకున్న రేంజ్ లో కనిపించకపోవడంతో పాదయాత్రకు బ్రేక్ వేసి బూత్ కమిటీలపై ఫోకస్ చేసేందుకు బిజేపీ అధిష్టానం చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలోని 119 నియోజికవర్గాలలో బూత్ కమిటీల సదస్సు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టె ఆలోచనలో ఉన్నారట కమలనాథులు. అందువల్ల బండి సంజయ్ పాదయాత్రకు బ్రేకులు పడ్డట్టే అనే వార్తలు వస్తున్నాయి. కాగా పాదయాత్రకు అనుకున్న స్థాయిలో ప్రజామద్దతు లభించకపోవడంతో.. బస్సు యాత్ర చేపడితే ఎలా ఉంటుందనే దానిపై కూడా కమలం పార్టీలో చర్చ జరుగుతోందట. మొత్తానికి కమలం పార్టీ ఎన్ని ప్రణాళికలు వేస్తున్న ప్రజా మద్దతు మాత్రం బి‌ఆర్‌ఎస్ కే ఉన్నట్లు స్పష్టంగా అర్థమౌతోంది.

ఇవి కూడా చదవండి…

తెలంగాణలో స్వర్ణ యుగం..

బీజేపీది ట్రబుల్ ఇంజన్ సర్కార్..

సెస్‌ ఎన్నికల్లో బీజేపీ ఓటమి…

- Advertisement -