కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికి ఆదర్శం

90
vakulabaranam

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ సంగం రాష్ట్ర కార్యదర్శి రావుల అశోక్ ఆధ్వర్యంలో హుజురాబాద్ లో సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డా వకుళభరణం కృష్ణమోహన్ రావు గారు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.dr వకుళ భరణం మాట్లాడుతూ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రజల మనిషి స్వతంత్ర సమరయోధుడు జాతీయ నాయకులలో మహోన్నత వ్యక్తిత్వంతో అందరిని ఆకట్టుకున్న మానవతావాది. ఆయన వ్యక్తిత్వం విశిష్టమైనది, జీవిత లక్ష్యాలు, మహోన్నతమైన వి, సంకల్పబలం హిమాలయా సమున్నతమైనది , పదవుల కోసం ఎన్నడు రాజీపడలేదు అర్రులు చచాలేదు నిర్మొహమాటంగా ఉంటూనే అందరినీ కలుపుకుపోయే ప్రత్యేక శైలి వారిది ఆయన ఇల్లు జలదృశ్యం ఒక కార్యాలయం ఆయన ఇల్లు ఒక గ్రంథాలయం ఆ గ్రంథాలయంలో ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు ఆయన ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేవాడు మాజీ మంత్రిని అనే అహంకారం ఆయనలో ఎన్నడూ చూడలేదు. ఒక మనిషిగా, మనిషిగా ప్రతి ఒక్కరిని గౌరవించే గొప్ప సంస్కారి. ఆయనది సంస్కర్త హృదయం. శాంతియుతంగా ,అహింసాయుతంగా మనిషిని మార్చాలని, మారాలని మనిషిలోని మంచితనాన్ని నమ్మినవాడు

కొండా లక్ష్మణ్ బాపూజీ కేవలం రాజకీయ నాయకుడు కాదు వ్యక్తిగతంగా సామాజిక దర్శనాన్ని రూపొందించిన మహాత్మ పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి కృషి చేసిన వాడు కాదు కానీ ఆయనకంటూ ఒక స్పష్టమైన దార్శనికత ఉంది ఆ దార్శనికత లేకుండా ఎన్నడు ఎవరికీ తలవంచకుండా 80 ఏళ్లు మేరునగదీరునిగా జీవించడం సాధ్యం కాదు ఆయన లక్ష్య శుద్దే ఆశలోను , నిరాశ లోను, ఓటమిలో ను విషయంలోనూ పదవులు ఉన్నా లేకపోయినా తన వెంట ఎవరు వచ్చినా రాకున్నా నిలువెత్తుగా నిలిచి కొనసాగడానికి కారణం మహాత్మ జ్యోతిరావు పూలే నారాయణ గురు వాలే వారి వారసత్వాన్ని స్వీకరించి గాంధీ మార్గంలో నడిచిన రామ్ మనోహర్ లోహియా వంటి దార్శనికతను జీవితాంతం ఆచరించిన వాడు నమ్మినవాడు కొండా లక్ష్మణ్ బాపూజీ

బీసీల రిజర్వేషన్ గురించి ఆయా కులాల వృత్తి సహకార సంఘాలకు సబ్సిడీ లోన్ గురించి రాయితీల గురించి యువతరం ఉన్నత విద్య అందుకోవడం గురించి చేనేత అభివృద్ధి గురించి దళితుల హక్కుల గురించి ఇలా చెపుతూపోతే సాంఘిక సంక్షేమం కోసం ఆయన చేపట్టని కార్యక్రమం లేదు ఉమాశంకర్ దీక్షిత్ చాడీలు చెప్పి ఇంద్ర గాంధీ వద్ద బాపూజీ ప్రతిష్టను దెబ్బ తీసినప్పుడు కూడా కుంగిపోలేదు గవర్నర్ పదవి కూడా వద్దని సున్నితంగా తిరస్కరించారు తెలంగాణ స్వతంత్ర సమరయోధుల సంఘానికి అధ్యక్షుడిగా నియమించినప్పుడు ఎవరు నిజం కు వ్యతిరేకంగా ఉద్యమించారో వారి కేసులను ప్రతిదీ ప్రత్యక్షంగా పరిష్కరించారు కొడుకు నీ భారత్ పాకిస్తాన్ యుద్ధం కి పంపించారు భార్య యుద్ధంలో డాక్టర్ గా సేవలు అందించారు ఇలా కుటుంబం మొత్తం దేశ సేవకు సామాజిక సేవకు అంకితం చేసిన బాపూజీ వంటి వారిని వెళ్ల మీద లెక్కపెట్టవచ్చు

కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు నిరుపానమైనవి. స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని ఆయన ఆకాక్షించారు. బాపూజీకి మనం అందించే నిజమైన నివాళి అదే’ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మహా సభ రాష్ట్ర నాయకులు శ్రీహరి యాదవ్, బీసీ సంక్షేమ సంగం సదానందం నాయకులు కన్నబోయిన మహేందర్ యదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నబోయిన శ్రీనివాస్ యాదవ్ ఏనూరిఅశోక్, బద్దుల రాజకుమార్, శ్రీనివాస్ యాదవ్ అల్లి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.