CM KCR:రాష్ట్ర ప్రగతే ప్రస్థానమే..బాపూజీకి నిజమైన నివాళి

24
- Advertisement -

తాను నమ్మిన విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటాన్ని నడిపిన కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ బడుగు, బలహీన వర్గాల చైతన్యానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా, వారు తెలంగాణకు అందించిన సేవలను, చేసిన త్యాగాలను సీఎం స్మరించుకున్నారు.

దేశ స్వాతంత్ర్యోద్యమంలో, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటం నాటి తరాన్ని ఎంతో ప్రభావితం చేసిందని సీఎం అన్నారు.ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా ఎన్నో పదవులను నిర్వహించిన బాపూజీ, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యజించి నిబద్ధత కలిగిన నేతగా చరిత్రలో నిలిచారని సీఎం అన్నారు.

బాపూజీ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాచరణ ద్వారా నెరవేరుస్తున్నదని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సీఎం స్పష్టం చేశారు.వారి స్మారకార్థం పలు కార్యక్రమాలు చేపట్టామని, తెలంగాణ ప్రభుత్వం ప్రతి యేడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తూ ఆయనకు నివాళి అర్పిస్తున్నదని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానమే కొండా లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళి అని సీఎం అన్నారు.

Also Read:డెంగ్యూ యమ డేంజర్.. ఇవి తినండి!

- Advertisement -