ట్రంప్‌కు రీఎంట్రీ ఇచ్చిన ట్విట్టర్

252
- Advertisement -

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ జే.ట్రంప్‌ను మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ట్విట్టర్ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్‌ ట్రంప్‌పై ఓటింగ్‌ నిర్వహించారు. దీంతో అతనికి 51.8మంది ప్రజలు మద్దతు ఇవ్వగా మిగిలిన వారు వ్యతిరేకించారు. మస్క్‌ను ట్విట్టర్లోకి ఆహ్వానించినట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో 22 నెలల తర్వాత ట్రంప్‌ ఎకౌంట్‌ ట్విట్టర్‌లో మళ్లీ ప్రత్యక్షమైంది. గతంలో 2021 జనవరిలో జరిగిన క్యాపిటల్ హిల్ దాడి తర్వాత ట్రంప్ అకౌంట్‌ను మైక్రోబ్లాగింగ్ వబ్‌సైట్‌ బ్యాన్‌ చేసిని సంగతి తెలిసిందే.

ఈసందర్భంగా ఎలన్ మస్క్‌ ట్వీట్ ద్వారా స్పందిస్తూ…ట్రంప్‌ కాకాను పునరుద్దరిస్తున్నామని మస్క్‌ ట్వీట్ చేశారు. ‘ప్రజల స్వరం, దేవుని స్వరం’ (వోక్స్‌ పాపులి, వోక్స్‌ డీ) అంటూ ల్యాటిన్‌ పదబంధాన్ని ఉపయోగించారు. డోనాల్డ్ ట్రంప్‌కు తిరిగి ట్విట్టర్ ఖాతాను ఇద్దామా వ‌ద్దా అని ఎలాన్‌ మస్క్‌ పోల్ నిర్వహించారు. ఎస్ ఆర్ నో చెప్పాలంటూ శనివారం ఆయ‌న ఓ ట్వీట్ చేశారు. 24 గంటలపాటు కొనసాగిన ఈ పోల్‌లో కోటీ 50 లక్షల 85వేల 458 మంది పాల్గొన్నారు. దీంతో 22 నెలల నిషేధం తర్వాత ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను సంస్థ పునరుద్ధరించింది.

ఇవి కూడా చదవండి…

ఖతార్‌ వేదికగా ప్రపంచపోరు…

ఆపరేషన్‌ రోప్‌ మరింత జటిలం..

సుమన్‌కి కాంతారావు పురస్కారం

- Advertisement -