శ్రుతి హాసన్ కి మహర్దశ.. కానీ ఓ పెద్ద సమస్య ?

133
shruthi
- Advertisement -

శ్రుతి హాసన్ కి ప్రస్తుతం 36 సంవత్సరాలు. ఆల్ మోస్ట్ ఫేడ్ అవుట్ దశ అంచుల్లో ఉంది. అయినప్పటికీ, శ్రుతి హాసన్ కి ఇంకా హీరోయిన్ పాత్రలే దక్కుతున్నాయి. 35 ఏళ్ళు దాటాక నయనతార, సమంత, అనుష్క శెట్టి వంటి ఇద్దరు ముగ్గురికి మాత్రమే ఈ వయసులో స్టార్ హీరోయిన్ గా కనిపించే అదృష్టం దక్కింది. ఆ అదృష్టం ఇప్పుడు శ్రుతి హాసన్ ని కూడా పట్టింది. పైగా శ్రుతి హాసన్ సినిమాల లిస్ట్ చూస్తుంటే.. మిగిలిన హీరోయిన్ల కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. మెగాస్టార్ ‘‘వాల్తేరు వీరయ్య’’, బాలయ్య బాబు ‘‘వీరసింహా రెడ్డి’’, ప్రభాస్‌ ‘‘సలార్‌’’ ఇలా.. ప్రస్తుతం శ్రుతి హాసన్ చేస్తున్న సినిమాలన్నీ భారీ చిత్రాలే. ముఖ్యంగా రానున్న సంక్రాంతి పండగ అంతా ఒక్క శ్రుతి హాసన్ దే. వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి చిత్రాలు సంక్రాంతి సినిమాలే. కాబట్టి, 2023 సంక్రాంతికి థియేటర్స్ లో శ్రుతి హాసనే ఎక్కువ కనిపించబోతుంది.

ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరోయిన్ కి ఇంత మహర్దశ పట్టలేదు. ముదురు వయసులో హీరోయిన్ గా చివరి స్టేజ్ లో ఉన్న శ్రుతి హాసన్ కి మాత్రమే ఈ అరుదైన అవకాశం దక్కింది. ఐతే, ఇక్కడ ఒక సమస్య ఉంది. మెగాస్టార్ ‘‘వాల్తేరు వీరయ్య’’ – బాలయ్య బాబు ‘‘వీరసింహా రెడ్డి’’ సినిమాలు సంక్రాంతికి పందెం కోడిపుంజుల్లా గట్టిగా పోటీ పడబోతున్నాయి. మరి, ఈ రెండు సినిమాల విడుదల సమయంలో శ్రుతి హాసన్ ఏ సినిమాకి ఎక్కువ ప్రమోషన్ చేస్తోంది ?, బాలయ్య బాబు సినిమాకి ఎక్కువ ప్రమోషన్‌ చేస్తే.. మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. పోనీ, మెగాస్టార్ సినిమాకి ఎక్కువ సపోర్ట్‌ చేస్తే.. బాలయ్య ఫ్యాన్స్ ఆమెను ట్రోలింగ్ తోనే చిదిమేస్తారు. మరి ఇప్పుడు శ్రుతి హాసన్ పరిస్థితి ఏమిటి ?, సినిమాలు అయితే ఫుల్‌ స్పీడ్‌లో చేస్తోంది గానీ.. ప్రమోషన్స్ ను ఎలా మేనేజ్‌ చేస్తుంది ?, చేయలేకపోతే ఇద్దరు హీరోల అభిమానులంతా మొదట ఆమె పైనే విరుచుకుపడతారు. మరీ దీన్ని మహర్దశ అనాలా ? లేక, అడ్డంగా బుక్ అయింది అనాలా ?, శ్రుతి హాసన్ కే వదిలేద్దాం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -