ఆర్‌ఆర్‌ఆర్‌ ఫస్ట్ డే…విషెస్ చెప్పిన ఉపాసన

211
rrr
- Advertisement -

అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజమౌళి,రాంచరణ్,ఎన్టీఆర్(ఆర్‌ఆర్‌ఆర్‌)ఇటీవలె ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఇవాల్టీ నుంచి అఫిషియల్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న రాంచరణ్‌కు విషెస్ చెప్పింది రాంచరణ్‌ భార్య ఉపాసన.అయ్యప్ప మాల ధారణలో ఉన్న చెర్రీ ఫోటోను షేర్ చేసిన ఉపాసన ఫస్ట్ డే బెస్ట్ విషెస్ అంటూ ట్వీట్ చేసింది.

సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో ఇటు మెగా అటు నందమూరి అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటించున్నట్లు టాక్. కీర్తి సురేశ్, రష్మిక, సమంతను హీరోయిన్లుగా తీసుకోవచ్చని టీ టౌన్‌లో ప్రచారం జరుగుతోంది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మైంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ బాహుబలి మూవీ తర్వాత చాలా గ్యాప్‌ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

- Advertisement -