NIA కేంద్ర కార్యాలయం దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉగ్రవాదులతో రాణాకు సంబంధాలు ఉన్న నేపథ్యంలో భారీ భద్రత మధ్య పాటియాలా కోర్టులో హాజరు పర్చారు ఎన్ఐఏ అధికారులు.
పాక్ సైన్యం, ISI లతో సంబంధాలు, 26/11 దాడుల్లో పాకిస్థాన్ పాత్రపై ఆరా తీయనున్నారు. తహవూర్ రాణా ఉన్న సెల్ లో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా రాణా విచారణను వీడియో రికార్డు చేయనుంది ఎన్ఐఏ.
తహవూర్ రాణాకు 18 రోజుల కస్టడీకి అప్పగించింది పాటియాలా కోర్టు. భారీ భద్రత మధ్య తహవుర్ రాణాను కోర్టులో హాజరుపరిచింది ఎన్ఐఏ. రాణాను 20 రోజుల కస్టడీకి కోరగా 18 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. రాణాను 20 రోజుల కస్టడీకి కోరగా 18 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు.
Also Read:TTD: వైభవంగా కోదండరాముని తెప్పోత్సవాలు

