కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్. రాహుల్ తన ట్వీట్లతో సమాజంలో విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఇటీవల యూపీలో ఓ ముస్లిం వ్యక్తిపై దాడి జరుగగా జైశ్రీరామ్ అని పలకనందుకు అతనిపై దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్…యోగీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.
దీంతో రాహుల్ వ్యాఖ్యలపై తనదైన శైలీలో మండిపడ్డారు సీఎం యోగి. శ్రీరాముడు తొలుత నేర్చుకున్నది సత్యం మాట్లాడటం అని, అది మీరు మీ జీవితంలో ఎప్పుడూ చేయలేని రాహుల్‌ను విమర్శించారు. అధికారం కోసం మానవత్వాన్ని మరిచిపోతున్నారని రాహుల్ వైఖరిని దుయ్యబట్టారు.
బులంద్‌షెహర్‌కు చెందిన 71 ఏళ్ల సూఫీ అబ్దుల్ సమద్‌పై దాడి జరిగింది. ఘజియాబాద్‌లో జరిగిన దాడిలో ఆ వృద్ధుడి గడ్డాన్ని కూడా కట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పర్వేశ్ గుజ్జర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.