శ్రీశైలంకు తగ్గిన వరద

232
srisailam
- Advertisement -

శ్రీశైలంకు వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. రెండు, మూడు రోజులుగా పడుతున్న భారీ వర్షాలు ఇప్పుడు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయంలో వరద నీరు క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 6,738 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం నిల్ గా ఉంది.

శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 816.90 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగాప్రస్తుతం 38.6292 టీఎంసీలుగా ఉంది. అయితే కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రస్తుతం జరగడం లేదు.

- Advertisement -