కరోనా టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి..

190
Kishan Reddy
- Advertisement -

ఈ రోజు కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఈ ఉదయం ఆయన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని కోరారు. టీకాపై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. ప్రధానమంత్రి మోదీ సహా పలువురు టీకా తీసుకుని ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి టీకా తీసుకునే స‌మ‌యంలో తెలంగాణ మంత్రి ఈటెల రాజేంద‌ర్ కూడా అక్క‌డే ఉన్నారు. హైద‌రాబాద్‌లోని భార‌త్‌బ‌యోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ టీకాను సోమవారం ఆయ‌న కూడా వేయించుకున్నారు. కాగా, 60 ఏళ్లు దాటిన వారికి దేశ‌వ్యాప్తంగా ఉచిత టీకా పంపిణీ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దీర్ఘ‌కాల వ్యాధులు ఉన్న 45 ఏళ్లు దాటిన వారికి కూడా కోవిడ్ టీకా ఇస్తున్నారు. కోవిన్ పోర్ట‌ల్‌లో రిజిస్ట‌ర్ చేసుకున్న వారికి ప్ర‌భుత్వ ద‌వాఖాన‌ల్లో టీకాలు ఇస్తున్నారు.

- Advertisement -