కేంద్ర బడ్జెట్‌ 2022 హైలైట్స్..

110
- Advertisement -

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధాని మోదీ హయాంలో 10 వ బడ్జెట్‌, నిర్మలకు నాలుగో బడ్జెట్‌. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని ఆమె అన్నారు.

బడ్జెట్ హైలైట్స్:

-కరోనా మహమ్మారి వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలమనే విశ్వాసం మనకుంది.
-ప్రపంచంలోనే మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.
-వచ్చే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను రూపొందించాం.
-పేద, మధ్య తరగతి పురోగతి కోసం కృషి చేస్తున్నాం.
-సాంకేతిక ఆధారిత అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నాం.
-జాతీయ రహదారులను 25 వేల కిలో మీటర్లకు పెంచుతాం.
-అత్యాధునిక వసతులతో కొత్త వందే భారత్ రైళ్లు. కవచ్ పథకం కింద 2 వేల కిలోమీటర్లు. 400 కొత్త జనరేషన్ వందే భారత్ రైళ్లు. 100 పీఎం గతి శక్తి కార్గో టెర్మినల్స్.
-దేశంలో నాలుగు ప్రాంతాల్లో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు.
-పర్వతమాల ప్రాజెక్టు కింద 8 రోప్ వేల నిర్మాణం. 60 కిలోమీటర్ల దూరంలో ఒక్కో రోప్ వే నిర్మాణం.
-డ్రోన్ టెక్నాలజీని పెంచేందుకు డ్రోన్ శక్తి పథకం.
-ఎయిర్ ఇండియా బదిలీ సంపూర్ణంగా పూర్తయింది.
-సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకాలను అందిస్తాం.
-తృణ ధాన్యాల ఉత్పత్తి, మార్కెటింగ్ కు ప్రత్యేక ప్రోత్సాహకాలు.
-2023ను తృణ ధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నాం.
-వరి, గోధుమ మద్దతు ధర చెల్లింపులకు రూ. 2.7 లక్షల కోట్లు.
-రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు పథకం.
-ప్రాంతీయ భాషల్లో విద్యాభివృద్ధికి టీవీ ఛానెళ్లు.
-డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్శిటీ.
-వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన.
-ఆత్మ నిర్భర్ భారత స్ఫూర్తితో 16 లక్షల ఉద్యోగాలను కల్పించాం.
-ఎయిర్ ఇండియా బదిలీని సంపూర్ణంగా పూర్తి చేశాం.
-రైల్వేలో సరకుల రవాణాకు సరికొత్త పథకం.
-కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా ప్రాజెక్టులకు డీపీఆర్ సిద్ధమైంది.

- Advertisement -